AP SEC Nilam Sawhney (Photo-Twitter)

Amaravati, April 1: ఏపీలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ (AP ZPTC MPTC elections 2021) విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ (AP ZPTC MPTC elections) జరగనుంది. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని (Nilam Sahweny) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

SEC Nilam Sawhney Meet Governor

MPTCs/ZPTCs Elections Notification

ఇవాళ రాజకీయ పార్టీలతో మీటింగ్‌ పెట్టారు. ఆ తర్వాతే ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వుుల జారీ చేశారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై ఎస్ఈసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఏపి సీఎం వైఎస్ జగన్, అర్హులైన ప్రతీ ఒక్కరు టీకా కోసం ముందుకు రావాలని పిలుపు; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1271 కోవిడ్ కేసులు నమోదు

శుక్రవారం రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఆమె అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ లోపు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

.