APSRTC: భారీగా తగ్గిన ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం, డిమాండ్ లేని రూట్లలో బస్సులు రద్దు, తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ, సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి
APSRTC Buses. (Photo Credit: PTI)

Amaravati, April 28: కరోనావైరస్ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి (APSRTC implemented government guidelines) తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది.

దాంతో ఆర్టీసీ ఆదాయంపై (APSRTC Income) కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది. దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్‌ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది. ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు.

తగ్గిన తిరుమల రద్దీ: ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. గతంలో 50 వేల వరకూ భక్తులు వస్తే.. తాజాగా 12 వేల మంది కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం లేదు. మంగళవారం 11490 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 30 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 5024 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే

చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్‌–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు నడుం బిగించారు. రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నారావారి పల్లె పీహెచ్‌సీని, చంద్రగిరి ఏరియా ఆస్పత్రిని అధికారులతో కలిసి సందర్శించిన ఆయన తుడా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

లాక్‌డౌన్ మీద జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, లాక్‌డౌన్ విధిస్తే ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుంది, గతేడాది ప్రభుత్వానికి రూ.20,000 కోట్ల నష్టం, ప్రజలకు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపిన ఏపీ సీఎం

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్‌ సెంటర్‌లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో వెయ్యి మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. చంద్రగిరికి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్‌ కొనుగోలుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరించనున్నటేకట ప్రకటించారు.

జగనన్న వసతి దీవెన, రూ.1,048.94 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ

చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామని చెవిరెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్‌ మెడికల్‌ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు.