Atmakur By-Election 2022: కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్, ఉదయం 9 గంటలకు 11 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి
Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

SPSR Nellore, June 23: ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఆత్మకూరు ఉదయం 6 గంటల నుంచేబారులు తీరారు ఓటర్లు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్‌ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ (Atmakur By-Elections 2022) జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరగనుంది. 26న ఫలితాలు వెలువడుతాయి. మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటలు ముగిసేనాటికి 11శాతం పోలింగ్ (11 % voter turnout recorded) నమోదు అయినట్లు ఈసీ ప్రకటించింది.

ఆత్మకూరు నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలు, వీటిలో 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. ఈఉప ఎన్నికకు 1339 మంది పోలింగ్ సిబ్బంది, 1032 మంది పోలీస్, ఏ.ఆర్.పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ రెండు కంపెనీలు, సీఐఎస్‌ఎఫ్‌ ఒక కంపెనీ.. బలగాలు ఉపఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు నియోజకర్గంలో 2,13,138 మంది ఓటర్లు, వీరిలో 1,07,367 మంది మహిళలు, 1,05,960 మంది పురుష ఓటర్లు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు. ఉదయం ఆరు గంటలకు పోలింగ్‌ ఏజెంట్స్ సమక్షంలో మాక్ పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో.. 82.44 శాతంగా పోలింగ్ నమోదుఅయింది.

కొనసాగుతున్న ఓటింగ్, 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరువరకు పోలింగ్

బైపోల్‌ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ ఎన్.ఓబులేసు.. మరో ఐదు మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.