Atmakur Bypoll Results 2022: తొలిరౌండ్‌లోనే వైసీపీకి 5,337వేల ఓట్ల మెజార్టీ, జగన్ సర్కారు లక్ష మెజార్టీ దాటుతుందా, బీజేపీ డిపాజిట్ క్రాస్ చేస్తుందా.. ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
Visuals from a vote counting centre (Photo Credits: PTI)

ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయింది. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది