Atmakur, June 23: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ (Atmakur Bypll 2022) ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోనే క్యూలైన్లలో సాయంత్రం 6 తర్వాత ఇంకా ఓటర్లు ఉన్నారు. వైసీపీ తరపున (YSRCP) గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ (BJP) తరఫున భరత్‌కుమార్‌తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిబందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దాదాపు 70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించిన కొందరిని పోలీసులు అడ్డుకుని పంపించి వేశారని తెలిపారు. కొన్ని చోట్ల బీజేపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్సణలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగగా... టీడీపీ (TDP) పోటీకి దూరంగా ఉండిపోయింది.