File image used for representational purpose | (Photo Credits: ANI)

Amaravathi, December 13: 2007 సంవత్సరంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో (Ayesha Meera Murder Case) CBI అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రెవెన్యూ శాఖాధికారులను సీబీఐ (Central Bureau of Investigation)అధికారులు కలిశారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ రీ పోస్టుమార్టం(re post mortem) ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. పోస్టుమార్టం చేస్తే..కొన్ని ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు.డిసెంబరు 20 లోగానే ‘రీ-పోస్టుమార్టమ్‌’ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కోనేరు సతీష్‌ను కూడా సీబీఐ విచారించింది. మరోవైపు కోర్టులో పనిచేసే సిబ్బంది ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను మాయం చేశారంటూ వారిని సస్పెండ్ కూడా చేశారు. అయితే, ప్రస్తుతం ఆయేషా మీరా భౌతిక కాయానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తే.. కొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.. దీని కోసం రేపు తెనాలి వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులతో సీబీఐ అధికారులు సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొత్తగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఈ కేసును పునర్విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఆయేషా మీరా కేసును దిశ చట్టం కిందికి తీసుకొస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. మహిళలకు భద్రత కల్పించడానికి అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో.. ఆయేషా మీరా కేసులో పునర్విచారణ చేపట్టనుండటంతో ఈ కేసు చివరికి ఎలాంటి మలుపును తీసుకుంటుదనేది ఉత్కంఠను రేపుతోంది.