Badvel Bypoll Result 2021: జగన్ పాలనకే జై కొట్టిన బద్వేల్ ఓటర్లు, 90,533ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ, విజేతకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
YSRCP's Dasari Sudha meets AP CM YS Jagan (Photo-Twitter)

Badvel, Nov 2: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం (YSRCP's Dasari Sudha Wins) సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ దూకుడు ముందు మిగతా పార్టీలు ఏవీ నిలబడలేకపోయాయి. మొత్తం 13 రౌండ్లు ముగిసే నాటికి వైసీపీకి 1,12 072 ఓట్లు, బీజేపీకి 21,661, కాంగ్రెస్ పార్టీకి 6,211, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 90,533ఓట్ల మెజార్టీతో (Secures 90,089 Votes) వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ విజయం సాధించారు.

బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో (Badvel Bypoll Results 2021) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం జగన్‌ అభినందించారు. అలానే చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు.

Here's YSR Congress Party Tweet

విజయం సాధించిన అనంతరం వైయస్ఆర్ సీపీ అభ్యర్థి డా. దాసరి సుధ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిష్పక్షపాత పరిపాలన వల్లే ఈ రోజు ఇంతటి గెలుపు సాధ్యమైందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పై అభిమానంతో గత ఎన్నికల్లో 45 వేలు మెజారిటీ ఇస్తే, జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు

Here's AP CM Tweet

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

"శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను... ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను" అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు.