C.M. Ramesh (Photo Credits: ANI)

Amaravati, August 7: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CM Ramesh tests positive for COVID-19) అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు (BJP MP CM Ramesh) కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు

Here's what He Said: 

ఇదిలా ఉంటే తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కోవిడ్‌తో (Srinivasa Charyulu Dies With corona) కన్నుమూశారు. గోవిందరాజు స్వామి ఆలయం నుంచి శ్రీనివాసాచార్యులు డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు.

వారం క్రితం ఆయనకు కరోనా వైరస్‌ రావడంతో తిరుపతి స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగారు.