Cash For Vote Case alla-ramakrishna-reddy-file-early-hearing-petition (Photo-Instgram)

Amaravathi, November 26: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ( Two Telugu States) సంచలనాన్ని రేకెత్తించిన ఓటుకు నోటు కేసు(Cash For Vote Case) మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు( Supreme court)లో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్‌ పిటిషన్‌ (Early Hearing Petition) దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Mangalagiri YCP MLA Alla Ramakrishna Reddy) ఈ పిటిషన్‌ ను దాఖలు చేశారు. 2017 లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్‌ ను దాఖలు చేసినప్పటికీ... సుప్రీంకోర్టులో ఆ పిటిషన్‌ లిస్ట్‌ కాలేదు.

దీంతో, ఆయన మరోసారి సర్వోన్నత న్యాయస్థానం గడపతొక్కారు. 2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి(Revanth reddy) ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతోపాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

2015లో తెలంగాణలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారు. ఈ క్రమంలో అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొన్ని రోజులపాటు జైలులో గడిపారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కూడా చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆర్కే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజాగా ఆయన మళ్లీ సుప్రీంకోర్టు గడపతొక్కారు.