Amaravati, Mar 17: ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.
ఇకపై సిమెంటు(పీపీసీ) బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా రూ.235కి ఇస్తామని.. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ధరలు తక్కువని (Cement Prices) వారు చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌లో సిమెంటు బస్తా ధర రూ.380 వరకు ఉందని, కొన్ని పనులకు మాత్రం తగ్గించి ఇస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పనులు, పేదల ఇళ్లకు అవసరమయ్యే సిమెంటు లెక్కలను అధికారులు వారికి తెలియజేశారు.
గృహనిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్ టన్నులు, పంచాయతీరాజ్ శాఖకు 25 లక్షల మెట్రిక్ టన్నులు, జలవనరుల శాఖకు 16.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని పేర్కొన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బస్తా ప్రత్యేక రంగులో ఉండాలని.. ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం తెలిపారు.
Here's AP CMO Tweet
పేదలకు ఇళ్లు, ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు. గడచిన ఐదేళ్లతో పోలిస్తే అతితక్కువ రేటుకు సిమెంటు.
ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సిమెంటు కంపెనీల నిర్ణయం. pic.twitter.com/eP9IBjOFYi
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 16, 2020
సమావేశంలో జువారి, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అలా్ట్రటెక్, జేఎ్‌సడబ్ల్యూ, శ్రీచక్ర, ఇండియా, మైహోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్య బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్ సిమెంటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.