Chandrababu Health Update: చంద్రబాబు హెల్త్ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్న టీడీపీ అధినేత, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపిన వైద్యులు
Chandrababu Naidu (Photo-Video Grab)

Rajahmundry, Oct 13: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు.ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బాగా బరువు తగ్గినట్టు ఆయనకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి సమాచారం ఇచ్చారు.వైద్యులను పంపాలని లేఖలో కోరారు.

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం

వెంటనే స్పందించిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.సునీతాదేవి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు.

వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం. సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ మాట్లా­డు­తూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా, సుప్రీంకోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించిన ఇరు పక్షాల న్యాయవాదులు

చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్‌ నార్మల్‌గా ఉందన్నారు. పల్స్‌ రేట్‌ 87 (నిమిషానికి) ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.