stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Chittoor, Oct 4: ఏపీలో చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణ ఘటన (Chittoor Shocker) జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి (Teenager rapes 80-year-old woman) తెగబడడ్డాడు. అనంతరం ఆమె మనవరాలిపైనా అత్యాచారానికి యత్నించాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు (Palamaner Chittoor) పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో బాధిత వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె బంధువులు కాస్తంత దూరంగా ఉంటున్నారు.

శనివారం మధ్యాహ్నం మంచంపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించిన అదే కాలనీకి చెందిన బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత గంటకు బాధితురాలి ఆరేళ్ల మనవరాలు భోజనం తీసుకుని రాగా, నిందితుడు ఆమెపైనా అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు.

వీడు తండ్రేనా.. కూతురికి మద్యం తాగించి ఆపై లైంగిక దాడి, ఈ దారుణాన్ని వీడియో తీసిన అతని ప్రియురాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు

నిన్న ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు, ఆమె మనవరాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.