Vij, Nov 9: ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు.
రాష్ట్రానికి టూరిజం ఒక వరం... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది మా విధానం అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం... ప్రజలు గెలిపించారు అన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పని చేస్తాం అని తేల్చిచ ఎప్పారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ, గత మూడు సార్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి అన్నారు. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను అని తేల్చిచెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులైందని, ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. క్యాపిటలిజం,సోషలిజం,కమ్యూనిజం అన్నీ ఇజాలు పోయాయని, ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం ఉంటుందని, అదే టూరిజం అన్నారు. సీప్లేన్ సర్వీసులను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించిన స్పైస్ జెట్ సంస్థను అభినందించారు. మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ
కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నామని వివరించారు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందని వెల్లడించారు. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుందని తెలిపారు. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందని వివరించారు.