Kuppam, Feb 26: తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట ఇచ్చినట్లుగానే సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు.
కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి.ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగిందని సీఎం తెలిపారు.
గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది.ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని సీఎం తెలిపారు.
Here's CMO Tweet
అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేసి నేడు కుప్పం నియోజకవర్గానికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం.
2/2 pic.twitter.com/KLQpaZRsGX
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 26, 2024
కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం @ysjagan.#YSJaganForKuppam#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/E34j696XRT
— YSR Congress Party (@YSRCParty) February 26, 2024
కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan
హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం.#YSJaganForKuppam#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/7ZvhD0qwbx
— YSR Congress Party (@YSRCParty) February 26, 2024
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా అని నిలదీశారు. చంద్రబాబు నాడు మంత్రిగా ఉంటూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని, కుప్పం వచ్చి 35 ఏళ్లుగా గెలుస్తూ కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని దెప్పిపొడిచారు.
సొంత నియోజకవర్గం సంక్షేమాన్ని పట్టించుకోని ఈ వ్యక్తి (చంద్రబాబు) 75 ఏళ్ల వయసులో నలుగురితో పొత్తు పెట్టుకుని వస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. పొత్తులు దేనికి అంటే సమాధానం చెప్పడని అన్నారు. ఏదైనా ఒక గ్రామంలోకి వెళ్లి మీ మార్కు మంచి పని ఏదైనా చేశారా అంటూ అదీ చెప్పడు అని పేర్కొన్నారు. అన్నీ మంచి పనులు చేశానంటున్న చంద్రబాబు... ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని, తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని సభాముఖంగా ప్రకటించారు. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని స్పష్టం చేశారు.
"పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా... లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్... కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పంనకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్. చిత్తూరు పాలడెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్" అంటూ సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
"చంద్రబాబుకు నాపై కోసం వస్తే కడపను, పులివెందులను తిడతాడు. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడు. కానీ నేను ఏనాడూ కుప్పంను పల్లెత్తు మాట అనలేదు. కుప్పం నియోజకవర్గాన్ని కానీ, ఇక్కడి ప్రజలను కూడా ఒక్క మాట అనలేదు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
"14 ఏళ్లు పాలించానంటాడు... ఏం చేశాడు అంటే పెద్ద సున్నా అని సమాధానం వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోసం చేయడానికి తయారవుతాడు. ఇంటింటికీ కిలో బంగారం, ఒక బెంజి కారు అంటాడు... అవసరానికి వాడుకుని ఆ తర్వాత వదిలేసే నాయకుడు చంద్రబాబు. ఇలాంటి నాయకుడు కావాలా... చెప్పింది చేసే మీ బిడ్డ కావాలా?" అంటూ ప్రసంగించారు.