Visakha, Oct 16: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా తయారైంది. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు.విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
చంద్రబాబుకు ప్రాణహాని ఉంది! అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తా. వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలు. త్వరలోనే నేను విశాఖకు షిప్ట్ అవుతున్నానని తెలియజేశారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర అంటే డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు.