CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, August 21: ఏపీలో గడచిన 24 గంటల్లో 9,544 పాజిటివ్ కేసులు (AP Coronavirus) వెల్లడి కాగా, అదే సమయంలో 91 మంది వైరస్ మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. రాష్ట్రంలో ఇప్పటిరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 3,092కి పెరిగింది. కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.

ప్రస్తుతం 87,803 మంది చికిత్స పొందుతుండగా, మరో 8,827 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,34,940 పాజిటివ్ కేసులు (COVID-19-positive cases) నమోదు కాగా, 2,44,045 మంది కోలుకున్నారు. నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

Here's AP Covid Report

కోవిడ్‌-19 పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. చిత్తూరు పాల డెయిరీలో గ్యాస్ లీకేజి, 14 మందికి అస్వస్థత, అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ కావడంతో ఘటన, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం ఉన్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలని, నిరంతరం ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని చెప్పారు. కాల్‌ సెంటర్‌లతో పాటు ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.