Amaravati, Nov 23: ఏపీలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1 ,121 మందికి పాజిటివ్ (New positive cases) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు (COVID Report) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 1,631 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,41,026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,249. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,938కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు భారతదేశమే త్వరగా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 40 నుంచి 50 శాతం మందికి వ్యాక్సిన్ అందజేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 39వ స్నాతకోత్సవంలో ఆమె వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు. ప్రసుత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఇండియన్ జనరిక్ కంపెనీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు.