Amaravati, June 2: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,768 మందికి కరోనా పాజిటివ్‌గా (New Coronavirus Positive Cases) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,14,261 మందికి కరోనా వైరస్ (Coronavirus Positive Cases) సోకింది.
గడిచిన 24 గంటల్లో 15,612 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 62 వేల 229 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,43,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,94,48,056 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,132కు చేరింది.
అత్యధికంగా చిత్తూరులో 15మంది చనిపోగా, నెల్లూరు, 10, పశ్చిమగోదావరి 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, విజయనగరం 8, గుంటూరు 7, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 6, కృష్ణా 5, వైఎస్‌ఆర్ కడప 4, కర్నూలులో నలుగురు మృత్యువాతపడ్డారు.
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 103 మంది, తెలంగాణలో 123 మంది పిల్లలు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–ఎన్‌సీపీసీఆర్) తెలిపింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారి వివరాలు తెలపాలంటూ ఇటీవల జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బాలస్వరాజ్ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు అప్‌లోడ్ చేసిన వివరాలను ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ రూపంలో కోర్టుకు మంగళవారం అందజేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1,742 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారని, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 7,464 మంది ఉన్నారని పేర్కొంది. ఏపీలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినవారు 103 మంది, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 13 మంది ఉన్నారని పేర్కొంది.