Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, May 24: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 58,835 నమూనాలను పరీక్షించగా.. 12,994 మందికి పాజిటివ్‌ (Covid in AP) నిర్ధారణ అయ్యింది.తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి (Coronavirus in Andhra Pradesh ) చేరింది.

ఒక్క రోజు వ్యవధిలో 96 మంది కరోనాకు బలవ్వగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి (Covid Deaths) పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

మహమ్మారి కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా.. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10 మంది, అనంతపురంలో 9 మంది, తూర్పుగోదావరి,విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Here'a AP Covid Report

గత 24 గంటల్లో అనంతపురంలో 1047 కేసులు, చిత్తూరులో 1620, ఈస్ట్ గోదావరిలో 2652, గుంటూరులో 670, కడపలో 874, కృష్ణాలో 274, కర్నూలులో856, నెల్లూరులో 503, ప్రకాశంలో703, శ్రీకాకుళంలొ 864, విశాఖపట్నంలో 1690, విజయనగరంలో 535, వెస్ట్ గోదావరిలో 706 కేసులు నమోదయ్యాయి.

ఒంగోలు కోర్టు సంచ‌ల‌న తీర్పు, జాతీయ రహదారులపై హత్య కేసులో 12 మందికి ఉరిశిక్ష , మొత్తం 18 మంది నిందితుల్లో మున్నా సహా 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదు

ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ​ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం సోమవారం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షచేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.