Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, June 22: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు ( Coronavirus) నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. ఇప్పటివరకూ 18 లక్షల 57 వేల 352కి కరోనా సోకింది. మొత్తం12,416 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం 53 వేల 880 యాక్టివ్‌ కేసులు ఉండగా 17లక్షల 91 వేల 56 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 8,376 మంది రికవరీ అయ్యారు.

ఏపీలో 24 గంటల్లో 74,453 కరోనా టెస్టుల నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. తూ.గో, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో నలుగురు, విశాఖ, ప.గో జిల్లాల్లో ముగ్గురు, గుంటూరు, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

రాష్ట్రంలో తాజాగా కోవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ (Mega Vaccination Drive) అనంతరం 18 ఏళ్లు దాటిన వారిలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్న వారు 21.1 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 13,72,481 మందికి టీకాలు అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో 12,85,394 మందికి తొలి డోసు ఇవ్వగా 87,087 మందికి రెండో డోసు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 45 సంవత్సరాలు దాటిన 8.14 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.

ఐదేళ్లలోపు పిల్లలున్న 5.05 లక్షల మంది తల్లులకు టీకాలు ఇచ్చారు. 48,462 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 3681 మంది హెల్ల్‌ కేర్‌ వర్కర్లు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశంలో ఒకే రోజు వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డులను తానే అధిగమించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 14న నెలకొల్పిన 6,32,780 టీకాల రికార్డును ఏపీ తిరగరాసింది. దేశవ్యాప్తంగా ఒకరోజు వ్యాక్సినేషన్‌లో టాప్‌ 5 రాష్ట్రాల రికార్డులను చూస్తే అందులో మూడు ఆంధ్రప్రదేశ్‌ పేరుతోనే ఉండటం గమనార్హం.