Coronavirus in TS| (Photo Credits: PTI)

Amaravati, Sep 26: ఏపీలో గత 24 గంటల్లో 75,990 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 9,125 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,97,294. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,794. కోవిడ్‌బారిన పడ్డవారిలో తాజాగా 57 మంది ప్రాణాలు విడువడంతో ఆ మొత్తం సంఖ్య 5663 కి చేరింది.

ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా చేసిన పరీక్షల్లో 36,618 ట్రూనాట్‌ పద్ధతిలో, 36,372 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 55,23,786 నమూనాలు పరీక్షించామని వెల్లడించింది.

తాజాగా ప్రకాశం 10, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 5, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం 2, శ్రీకాకుళం 2, కర్నూలు, విజయనగరంలో ఒకరు చొప్పున మృతి చెందారు.

కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 (Coronavirus in India) చేరుకున్నాయి. అలాగే యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది.

కరోనా వైరస్‌తో దేశంలో మొత్తం 93,379 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,02,69,975 కరోనా వైరస్ (Coronavirus Outbreak in India) నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇక దేశంలో 10 రాష్ట్రాల నుంచే 74 శాతం రికవరీలు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా కొత్త కేసుల్లో 75 శాతం కూడా పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని పేర్కొంది.