Covid in AP: కాకినాడ ఎంపీకి కరోనా, ఏపీలో 4,57,008 మంది డిశ్చార్జ్, తాజాగా 9,901 మందికి కోవిడ్-19, మృతుల సంఖ్య 4,846కు చేరిక
COVID-19 Outbreak in India | File Photo

Amaravati, Sep 13: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 75,465 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 31,255 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు, 44,210 యాంటిజెన్‌ టెస్టులు ఉన్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45,27,593కు (COVID-19 AP) చేరింది. గడిచిన 24 గంటల్లో 9,901 పాజిటివ్‌ కేసులు (new Covid cases) నమోదయ్యాయి. 10,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

67 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 5,57,587 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,57,008 మంది కోలుకోగా, మరో 95,733 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,846కు ( Covid Deaths) చేరింది. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 84,786 టెస్టులు చేస్తూ దేశంలో ఏపీ మొదటిస్థానంలో కొనసాగుతోంది.

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో 9 మంది, చిత్తూరులో 8 మంది, ప్రకాశంలో 8 మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు, మత సామరస్యాన్ని దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 75 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో కలిపి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 75,394 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండ్రోజుల్నించి కోవిడ్ లక్షణాలు కన్పించడంతో జీజీహెచ్ లో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధాణైంది. స్వల్ప లక్షణాలే ఉండటంతో ఎంపీ వంగా గీత హోం ఐసోలేషన్ కు వెళ్లారు. ఇటీవలి కాలంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని కోవిడ్ ఆసుపత్రుల సందర్శనతో పాటు నియోజకవర్గ పర్యటన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.