AP Corona Report: ఆ మూడు జిల్లాల్లో 1200కు పైగా కేసులు, విజయనగరం జిల్లాలోకి ఎంటరయిన కరోనా, ఏపీలో 1,833కి చేరిన కేసుల సంఖ్య, 780 మంది డిశ్చార్జి
Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

Amaravati, May 7: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Corona Report) 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 56 మందికి కరోనా (Coronavirus) నిర్దారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,49,361 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో.. అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 10, వైఎస్సార్‌ జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 780 డిశ్చార్జి కాగా, 38 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1015 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Here's AP Corona Report

ఇదిలా ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 540 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 373 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 316 కేసులు నమోదు కాగా, నెల్లూరులో ఇప్పటివరకు 96 కేసులు నమోదయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. వైజాగ్‌లో లీకైన గ్యాస్ చరిత్ర ఇదే, దీని పేరు స్టెరిన్ గ్యాస్, 48 గంటల పాటు దీని ప్రభావం, ఈ గ్యాస్ పీల్చితే ఆరోగ్యంపై ప్రభావం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ..?

ఇదిలా ఉంటే విశాఖపట్టణంలోని (Visakhapatnam) ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి తెల్లవారుఝామున మూడున్నర గంటల సమయంలో స్టెరీన్ గ్యాస్ విడుదలైంది. విషవాయువు పీల్చి 9 మంది చనిపోయారు. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కంపెనీకి 5 కిలోమీటర్ల పరిధి వరకూ అనేక జంతువులు, పక్షులు కూడా చనిపోయాయి. చెట్ల రంగు మారిపోయింది.