Amaravati, Nov 4: ఏపీలో ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 సాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 84,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,849 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,30,731కి (Confirmed Cases) పెరిగింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
తాజాగా కరోనా నుంచి కొత్తగా 3,700 మంది (COVID recoveries) కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,02,325గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,734కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,672 యాక్టివ్ కేసులు ( Active Cases) ఉన్నాయి.రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
తాజాగా.. చిత్తూరు జిల్లాలో అత్యధింకగా 436 కేసులు నమోదుకాగా.. కృష్టాలో 421, తూర్పుగోదావరిలో 394, పశ్చిమగోదావరిలో 386, గుంటూరులో 277 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 15మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,734కి పెరిగింది. ప్రస్తుతం 21,672 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.