COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, May 26: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు (Covid in AP) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా (AP Logs 18,285 New Cases) బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 99 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు.

Here's AP Covid Report

గత 24 గంటల్లో అనంతపురంలో 1876 కేసులు, చిత్తూరులో 1822, ఈస్ట్ గోదావరిలో 3296, గుంటూరులో 1211, కడపలో 877, కృష్ణాలో 652, కర్నూలులో 1026, నెల్లూరులో 1159, ప్రకాశంలో 1056, శ్రీకాకుళంలొ 1207, విశాఖపట్నంలో 1800, విజయనగరంలో 639, వెస్ట్ గోదావరిలో 1644 కేసులు నమోదయ్యాయి.

జూన్‌లో అమలు కానున్న పథకాల లిస్ట్ ఇదే, వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, సీఎం సమీక్ష హైలెట్స్ పాయింట్స్ ఇవే

జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసులు

అనంతపురం: 132651

చిత్తూరు: 180422

ఈస్ట్ గోదావరి : 214467

గుంటూరు : 145713

కడప : 91723

కృష్ణా: 84917

కర్నూలు: 11247

నెల్లూరు: 114095

ప్రకాశం : 103119

శ్రీకాకుళం: 105888

విశాఖపట్నం: 131984

విజయనగరం: 72206

వెస్ట్ గోదావరి : 136 063