Coronavirus in AP | Representational Image (Photo Credits: PTI)

Amaravathi, April 23:  ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభన తీవ్రస్థాయిలో ఉంది. రాష్ట్రంలో గతంలో కంటే కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నా, గతంలో కంటే మించిన స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారంరాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటాయి. రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య 11 వేల మార్కును దాటింది.

రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సీఎం జగన్, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఉచిత వ్యాక్సిన్, టెస్టుల సంఖ్య పెంచడం, నైట్ కర్ఫ్యూ తదితర నిర్ణయాలు తీసుకుంది. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,581 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 11,766 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఏపి ఒకరోజులో నమోదు చేసిన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం.  తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 10,09,228 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 10,06,333గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 1,885 కోవిడ్ కేసులు నమోదు కాగా..  గుంటూరు నుంచి 1,593,  అనంతపూర్ నుంచి 1201, కర్నూల్ నుంచి 1180, శ్రీకాకుళం నుంచి 1052, ప్రకాశం నుంచి 491 మరియు విశాఖపట్నం నుంచి 489 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 38 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,579కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,441 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 9,27,418 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 74,231 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.