COVID-19 in India (Photo Credits: PTI)

Amaravati, Nov 16: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 53,215 నమూనాలు పరీక్షించగా.. 1 ,056 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,011కు (Coronavirus Cases) చేరింది. నిన్న ఒక్కరోజే 2,140 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,659. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 14 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,868కు (Coronavirus Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా గుంటూరులో 206 కేసులు బయటపడగా.. పశ్చిమగోదావరిలో 154, కృష్ణాలో 153, తూర్పుగోదావరిలో 139 మందికి వైర స్‌ సోకింది. రాష్ట్రంలో మరో 14 మంది కరోనాకు బలయ్యారు. విశాఖ, అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున.. తూర్పుగోదావరి, గుం టూరు, కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా (71) తీవ్ర అనారోగ్యంతో (YT Raja Passes Away) కన్నుమూశారు. ఆయనకు గత నెల 24న కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైటీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యు లు, బంధువులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమార్తెలు అవంతి, రాజేశ్వరి, కుమారుడు అవినాష్‌ ఉన్నారు.

దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 41,100 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, 447మంది మృతితో 1,29,635కి చేరిన మరణాల సంఖ్య

వైటీ రాజా 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తణుకు నుంచి గెలుపొంది ఐదేళ్ల పాటు సేవలందించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. కాగా వైటీ రాజా సోదరిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. తణుకుతోపాటు పశ్చిమగోదావరి జిల్లా ప్రగతి కోసం పరితపించిన రాజా మరణం టీడీపీకి తీరని లోటని అన్నారు. వైటీ రాజా మృతిచెందడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.