
Ongloe, Sep 19: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి విదితమే.ఢిల్లీతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (YSRCP MP Magunta Sreenivasulu Reddy) స్పందించారు. తాజాగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో (Delhi Excise Policy Scam) మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము.
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మా కుమారుడికి ఒక్క శాతం వాటా కూడా లేదు. లిక్కర్ స్కామ్‌లో మాపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో నేను, నా కొడుకు డైరెక్టర్లుగా లేము. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే.. మా బంధువులకు రెండో జోన్లలో షాపులు ఉన్నాయి. మా బంధువులకు మాగుంట పేరు ఉండటంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈడీ అధికారుల అనుమానం నివృత్తి చేశాము అని కామెంట్స్ చేశారు.