Devaragattu, Oct 27: ప్రతి ఏడాది ఆచారంగా విజయదశమి తర్వాత రోజున నిర్వహించే దేవరగట్టు కర్రల సమరాన్ని (Stick fight festival) ఈ ఏడాది పోలీసులు రద్దు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ (Section 144) విధించారు. ఎన్ని నిబంధనలు పెట్టినా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం (Devaragattu Bunny Festival) కొనసాగింది. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు బన్నీ ఉత్సవానికి (Devaragutta Dasara festival) హాజరయ్యారు.. నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాలవారు మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు.
ఈ కర్రల సమరంలో సుమారు 50 మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బన్నీ ఉత్సవం రద్దు అవుతుందని అధికారులు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి దేవరగట్టు చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతుంటాయి.
Here's Stick fight festival Videos
#WATCH: People in large numbers gather to celebrate Banni festival in Devaragattu village of Kurnool district despite the imposition of Section 144 in the area, yesterday.
At least 50 persons were injured during the festival. #AndhraPradesh pic.twitter.com/6LAWdKuwg9
— ANI (@ANI) October 27, 2020
Kurnool(dt), adoni(division), devaragattu bunny ustavalu... yesterday ni8, 27 people injured in fight.. pic.twitter.com/9H4Z2Jlgnd pic.twitter.com/jopTgb3pEo
— 9951781471 (@PAgLoEz69X9zay8) October 27, 2020
దివిటీలు, కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ఎంతోమంది తలలు పగులుతాయి.. జనాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది. కానీ దేవరగట్టులో ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాన్ని రద్దు చేశారు.. 2 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఊరిలో వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు. ఏటా దసరా పండుగకు నిర్వహించే కర్రల సమరం బన్నీ ఉత్సవానికి బ్రేకులు వేయడానికి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సవానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. కానీ జనాలు మాత్రం లెక్క చేయలేదు. వేల సంఖ్యలో అక్కడి చేరుకుని కర్రల యుద్దం చేసుకున్నారు.. పోలీసులు కూడా నిస్సహాయంగా ఉండిపోయారు. మొత్తానికి ప్రజలు దేవరగట్టు చేరనివ్వకుండా చెయ్యాలని చూసిన జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. కరోనా వచ్చినా సంప్రదాయాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ... ప్రజలు పట్టుదల చూపించారు.
దేవరగట్టుకు ఎవరూ రాకుండా ఉండాలని ముంబై చెక్ పోస్ట్ దగ్గర 50 సీసీ కెమెరాలు పెట్టి మరీ నిఘా కొనసాగించినా... ప్రజలు చాలా తెలివిగా... రహస్య కొండల మార్గాల్లో దేవరగట్టు చేరారు. బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు.