
Vishaka, july 11: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట సమీపంలో పెద్దేరు నది దాటుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు (Three bodies Found of river Pedderu) ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ దారుణం జరిగింది. మృతులు వడ్డాది గ్రామస్తులని.. గిడ్ల రాము (45),కొళ్ళమల్ల శ్రీను (48),సికలా దారకొండ(60) గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ఈ ప్రమాదం (Drowning tragedy in Andhra Pradesh) జరిగినట్లు చెప్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని వేగేశ్వరపురంలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి తన కుమార్తె (9), కుమారుడి (7)తో కలిసి ద్విచక్రవాహనంపై గోదావరి ఒడ్డుకు వచ్చారు. వారితో తీసుకొచ్చుకున్న అల్పాహారాన్ని తినేసి కాసేపు అక్కడే గడిపారు. కాసేపటి తర్వాత ఒక్కసారిగా తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకేశాడు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాళ్లపూడి ఎస్‌ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా వివరాలు పరిశీలించగా.. భీమవరానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.