Vijayawada, Oct 22: ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను (DA) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. అగస్ట్ 2న విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు.
దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం దసరా పండుగ ముందు ఒక డీఏను శనివారం విడుదల చేసింది.ఈ మేరకు డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. #sramedia pic.twitter.com/acfiKD7dYm
— SRA MEDIA NEWS (@SRAmediaNews) October 21, 2023
ఎప్పటి నుంచి అమలు చేయనున్నారంటే?
డీఏను 2022 జులై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. కాగా, దసరాకు రెండు రోజుల ముందు ఇప్పుడు డీఏ విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.