elderly-couple-attempts-suicide-by-climbing-water-tank-In-Andhra-pradesh (Photo-ANI)

Krishna,October 11:  భూ వివాదంలో తమకు రావల్సిన డబ్బును గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ వృద్ధ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకుపైకి ఎక్కారు. భూ వివాదంలో తమకు రావలసిన డబ్బు గ్రామ పెద్దలు ఇవ్వటం లేదని ఈ రకమైన ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. గ్రామమంలోని కొంతమంది వీరికి సంబంధించిన భూవివాదంలో మధ్య వర్తులుగా వ్యవహరించి అవతల పార్టీ నుంచి డబ్బు వసూలు చేశారు. అయితే, దానిని వీరికి ఇవ్వలేదు. దీని మీద వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. అపుడు కూడా ఫలితం లేకపోవడం తో ఇలా నిరసన వ్యక్తం చేశారు.

తమకు న్యాయం జరిగే దాకా ట్యాంక్ మీద నిలబడే నిరసన తెలుపుతామని వారు భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో.. స్థానికంగా ఉన్నవారు అధికారులకు సమాచారమిచ్చారు. వాసుదేవరావు, లక్ష్మీలతో మాట్లాడిన అధికారులు.. భూమి రిజిస్ట్రేషన్‌పై హామీ ఇచ్చి వారికి కిందికి దించారు.

వాటర్ ట్యాంకు ఎక్కిన దంపతులు

ప్రముఖ వార్తా సంస్థ ఎఎన్ఐ రిపోర్టు ప్రకారం వీరికి గ్రామ పెద్దల నుంచి రూ. 50 లక్షల వరకు రావాలని తెలుస్తోంది. దీనిపై గ్రామ పెద్దలు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.