Eluru (Photo-Wikimedia Commons)

Eluru, July 25: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో (Eluru Municipal Election Results) అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. మరిన్ని డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. 37 డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పటికే వైసీపీ మూడు డివిజన్లలో ఏకగ్రీవమైంది. ఇదిలా ఉంటే.. 50 డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. కాగా.. రెండోసారి మేయర్ అభ్యర్ధిగా నూర్జహాన్ బేగం రేసులో ఉన్నారు. బేగం గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

2, 33, 38, 39, 41, 42, 45, 46, డివిజన్లలో  వైసీపీ గెలుపొందగా.. 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2వ డివిజన్‌లో  వైసీపీ అభ్యర్థి జి. శ్రీనివాసరావు 788 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 33వ డివిజన్‌లో కె.రామ్మోహనరావు ( వైసీపీ- 88), 38వ డివిజన్‌లో హేమమాధురి ( వైసీపీ-261), 39వ డివిజన్‌లో జ్యోతి ( వైసీపీ- 799), 41వ డివిజన్‌లో కల్యాణీదేవి ( వైసీపీ- 547), 42వ డివిజన్‌లో ఎ.సత్యవతి ( వైసీపీ- 79), 45వ డివిజన్‌లో ప్రతాపచంద్ర ముఖర్జీ ( వైసీపీ- 1058), 46వ డివిజన్‌లో ప్యారీ బేగం ( వైసీపీ- 1232) జయకేతనం ఎగురవేశారు. 37వ వార్డులో టీడీపీ అభ్యర్థి పృథ్వీ శారద (టీడీపీ-150) విజయం సాధించారు. వీరిలో ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతి చెందారు.

ఏపీలో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 3లోగా తమకు పోస్ట్ ఇచ్చిన న్యాయస్ధానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

మరోవైపు 50వ డివిజన్‌లో  వైసీపీ మేయర్‌ అభ్యర్థి నూర్జహాన్‌ 570 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. 15వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి కన్నబాబు రంగా 94 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. అంతకుముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ  వైసీపీ ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో  వైసీపీ 11, టీడీపీ, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు. సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. కళాశాలలోని 4 కేంద్రాల్లో లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ కేటాయించారు.

డివిజన్ల వారీగా గెలిచిన వారి వివరాలు

1వ డివిజన్‌ ఎ.రాధిక (వైఎస్సార్‌సీపీ) విజయం

►2వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం.

► 3వ డివిజన్‌ బి.అఖిల (వైఎస్సార్‌సీపీ) విజయం

► 4వ డివిజన్‌ డింపుల్ (వైఎస్సార్‌సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు

► 12వ డివిజన్‌ కర్రి శ్రీను (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం

► 22వ డివిజన్‌ సుధీర్‌బాబు (వైఎస్సార్‌సీపీ) గెలుపు

►26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు(వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం

► 31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (వైఎస్సార్‌సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు

► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్‌సీపీ) గెలుపు

► 33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (వైఎస్సార్‌సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు

►37వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి విజయం

►38వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు

►39వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం

► 41వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం

► 42వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం

► 45వ డివిజన్‌ ముఖర్జీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం

► 46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు

► 48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు

► 26 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజ

► 50వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం

►20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజ

►41వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం