Fake news (representational image)

Amaravati, Oct 7: గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీదేవి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేసారని సోషల్ మీడియాలో (social media) పోస్టులు పెట్టడంతో అవి వైరల్ అయిన విషయం విదితమే. అయితే ఈ వార్తలపై ఏపీ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ (AP Police Warns Against Fake News) చేసింది. నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే (fake news posts) కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు.

ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్‌ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం. జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిమిషాల వ్యవధిలో ఫేక్‌ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి చేరింది. ఈ ఫేక్‌ న్యూస్‌కు కుల, మత, రాజకీయ రంగు పులిమారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్‌ న్యూస్‌పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్‌ చేసేటప్పుడు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

మాకు చుక్క నీరు కూడా ఎక్కువ వద్దు, రావాల్సిన వాటానే ఇవ్వండి, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాయల సీమ ఎత్తిపోతల పథకంపై క్లారిటీ ఇచ్చిన సీఎం

సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై పోలీసుల నిఘా ఉంటుంది. రెండేళ్ల క్రితం కళాశాల ఖాళీ చేస్తున్న సమయంలో సామాగ్రి, షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినటంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. కాగా సోషల్‌ మీడియాలో ఫోటోలు అప్‌లోడు చేసిన మురళి, మహేష్‌ రెడ్డి అనే ఇద్దరిపై పిడుగురాళ్ల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివాదాల సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.