Andhra Pradesh Train Accident (PIC@ ANI X)

Newdelhi, Oct 30: విజయనగరం (Vizianagaram) జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident) నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి (Trains Cancelled). కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి.

AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

Andhra Pradesh Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇప్పటి వరకు ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!