Vjy, Nov 6: ఏపీ ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది.చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన చేసిన సీఐడీ.. అనుమతివ్వాలని కోర్టును కోరింది.
ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.
చంద్రబాబు కంటికి రేపు క్యాటరాక్ట్ ఆపరేషన్, నేడు కూడా ఏఐజీ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.
సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే..
►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు
►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు.
►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి.
హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది.