Uyyalavada Narasimha Reddy Airport: రెండు రాజధానుల మధ్య విమాన సర్వీసులు, ఓర్వకల్లు నుంచి బెంగుళూరుకు వెళ్లిన తొలి ఇండిగో విమానం, తొలి దశలో విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాల రాకపోకలు
Kurnool / Orvakal Airport | Photo Credits: Twitter

Orvakal, Mar 28: కర్నూలు జిల్లా ప్రజల కల సాకారమైంది. కర్నూలు సిటీకి సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో (orvakal airport) విమానాల సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు (First commerical flight landed) చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. తొలి దశలో విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాల రాకపోకలు ప్రారంభించారు.

ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. మూడు నగరాలకు ఇండిగో సంస్థ ( Indigo Air lines) ఇక్కడి నుంచి విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును (Uyyalavada Narasimha Reddy Airport) సీఎం జగన్‌ ప్రకటించారు.

Here's Kurnool Airport Videos

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా రెండు రాజధానుల మధ్య తొలి విమాన సర్వీసు కూడా ఆదివారం మొదలైంది. తొలి ప్యాసింజర్స్ కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష (6 సంవత్సరాలు) లకు పూల మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

Uyyalawada Narasimha Reddy Airport launch

చరిత్రాత్మక ఘట్టం తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్ పోర్ట్ కు (Kurnool Airport) రావడం..కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం..తమ జీవితాల్లో ఎన్నటికీ మారిచిపోలేని మధురానుభూతిని మిగిల్చిందని ప్రయాణికులు చెప్పారు.