Road accident (image use for representational)

Amaravati, August 30: ఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆసుపత్రిలో మరణించింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన (Road accident in prakasam district) జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఎక్కిన ఆటోను బోల్తా పడకుండా డ్రైవర్‌ నియంత్రిస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ దాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన (Five People died in a road accident) జరిగింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగడానికి ముందు రోడ్డు దాటుతున్న గేదెను మరో టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో గేదె మృతిచెందింది. ఈ క్రమంలో ఆ తర్వాత వచ్చిన ఆటో గేదె కళేబరాన్ని గమనించకుండా దానిపైకి ఎక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కంట్లో కారం కొట్టి..మహిళ బట్టలూడదీసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించిన ప్రత్యర్థులు, తెలంగాణ సూర్యాపేటలో దారుణ ఘటన, 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

మృతి చెందిన వారు దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నారు. బేస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.