Chandragiri, Novemebr 9: చిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్–2020తో ముందుకెళ్లానన్నారు. ఈ విజన్ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారని చెప్పారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి (Chandragiri) సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు (Agrigold Victims) తెలుగుదేశం ప్రభుత్వం (TDP) పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, అయితే ఎన్నికల కోడ్ వల్ల అది ఆగిపోయిందన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ప్రభుత్వం ఆ నగదును బాధితులకు చెల్లించిందని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని నంబర్–1గా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నించానని, అయితే ఆ అదృష్టం తనకు లేదని తెలిపారు.