Representational Image (Credits: Facebook)

Vijayawada, Dec 5: ఆంధ్ర ప్రదేశ్‌లో (Andhrapradesh) ఈ ఉదయం ఘోర ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న టాటాఏస్ (TataAce) వాహనం ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు (Four Ayyappa Devotees) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 16 మందికి గాయాలయ్యాయి. క్షథగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి (Tenali Hospital) తరలించారు.

ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో వణుకు.. వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు.. దాదాపు 350 మంది కమాటీల ఊస్టింగ్..

ఈ ఘటన  బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని దగ్గర సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతులంతా కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు. అయ్యప్ప భక్తులు టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.