Andhra Pradesh: విషాదంగా ముగిసిన స్నేహితుల కథ, గుంటూరులో క్వారీ గుంతలో పడి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి సుచరిత
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Amaravati, July 12: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. కాళ్లకు బురద అంటుకుందని క్వారీ గుంతలోకి దిగిన నలుగురు స్నేహితులు అందులో గల్లంతయ్యారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించి చివరకు అందరూ తిరిగిరాని లోకాలకు (Four of friends drowned in water filled pit at stone) వెళ్లిపోయారు. విషాద ఘటన వివరాల్లోకెళితే.. ప్రత్తిపాడుకు (Guntur Prathipadu) చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్‌ (21), బిళ్లా సాయి ప్రకాష్‌ (23), ఇగుటూరి వీరశంకర్‌ రెడ్డి (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్‌ స్నేహితులు.

ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం డైట్‌ కళాశాల సమీపంలోని కొండ క్వారీ వైపు పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయ్యింది.దీంతో కాళ్లను కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన (సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు) క్వారీ గుంతలోకి ముందుగా శంకర్‌ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తరువాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వంశీ, వెంకటేష్‌ దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితోపాటు వీరూ మునిగిపోయారు.

విశాఖ జిల్లాలో పెను విషాదం, పెద్దేరు నది దాటుతూ ముగ్గురు మృతి, పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ప్రమాదం

నలుగురు యువకులు నీటి క్వారీ గుంతలో పడి గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది. విషయం దావానంలా వ్యాపించడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కలవారు ఘటనా స్థలానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. ఓ బిడ్డా.. నన్ను వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ గల్లంతైన వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ క్వారీలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలించగా క్వారీ గుంతల్లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురు మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. మరోవైపు క్వారీ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన యువకుల కుటుంబసభ్యులకు హోంమంత్రి సుచరిత ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

తీవ్ర విషాదం, కుటుంబం మొత్తాన్ని మింగేసిన కరెంట్‌ షాక్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లాలో కరెంట్ ఎర్త్ తగిలి ఆరుమంది మృతి

గుంటూరు సౌత్‌జోన్‌ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, ఆర్డీఓ భాస్కర్‌ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్‌ఐ అశోక్, తహసీల్దార్‌ ఎం.పూర్ణచంద్రరావుతో పాటు అధికారయంత్రాంగమంతా అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఓ దశలో సాయిప్రకాష్‌ చేతులు పైకిలేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్‌ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుడిని కాపాడేందుకు నీళ్లలోకి దిగి సాయికి చేయి అందించాడు. అతడిని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు. చివరికి ఫలితం లేకపోవడంతో సాయి చేయిని విడవక తప్పలేదని యశ్వంత్‌ కన్నీరుమున్నీరయ్యాడు.