Vjy, July 9: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో జలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు.
నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది.అయితే ఉచిత ఇసుక విధానంపై నెట్టింట కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉచితంగా ఇసుక అని చెప్పి టన్ను ఇసుక సుమారుగా రూ.1300లకు విక్రయిస్తున్నారంటూ కొన్ని ఫ్లెక్సీలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలో పాత ఇసుక విధానం రద్దు, ఉచిత ఇసుక పాలసీపై కొత్త జీవో విడుదల, నేటి నుంచి అమల్లోకి వచ్చే మార్గదర్శకాలు ఇవిగో..
నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద టన్ను ఇసుక రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని నెటిజనం కామెంట్లు పెడుతున్నారు.
Here's YSRCP Tweets
ఉచిత ఇసుక విధానం ముసుగులో @JaiTDP కొత్త దందా!
ఎవరెవరివో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు చూపిస్తూ ఇసుక లోడ్ చేయాల్సిందిగా బెదిరింపులు
స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ
రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి అవసరమైన వారికి అధిక ధరలకి అమ్ముకునే ఎత్తుగడ..… pic.twitter.com/6oDECv0JUV
— YSR Congress Party (@YSRCParty) July 9, 2024
`ఉచిత` నాటకం!
ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే
👉 కూటమి సర్కారు తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇదీ
👉 పన్నుల మోత, రవాణా చార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసిమోపెడు
👉 ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చ నేతలదే.. రవాణా ముసుగులో బయటకు తరలించి… pic.twitter.com/3ncIV7oDeh
— YSR Congress Party (@YSRCParty) July 9, 2024
Here's Viral Flexes
ఉచిత ఇసుక మీద కూటమి ప్రభుత్వం మాట తప్పినట్టే ఇదే గనుక నిజం అయితే. టన్నుకు 1225 అంటే చాలా ఎక్కువ. దానితో పాటు రవాణా ఖర్చులు అదనం!!! pic.twitter.com/djztSz4PN4
— RajPattem (@pattem_raj) July 8, 2024
టన్ను ఇసుక దాదాపు 1400 అంటే...
20 టన్నుల లారీ 28000
రవాణా అదనం
ఉచిత ఇసుక ఎట్లయింది ఈ పాలసీలో ?
పైగా ఈ ఆదాయం కూడా ప్రభుత్వానికి రాదు
కేవలం కాంట్రాక్టర్లకి..(ఆ ముసుగులో అస్మదీయులకు)
ఇదేదో తేడాగా ఉందే pic.twitter.com/7R9LrSPRFC
— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) July 8, 2024
నర్సీపట్నం
నర్సీపట్నం ఇసుక డిపోలో భారీ కుంభకోణం.
5 కోట్లవిలువ గల ఇసుక తరలించేందుకు పన్నాగాం.
ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని మోసం చేస్తున్న టీడీపీ..
టన్నుకు కేవలం 175 రూపాయిలు మాత్రమే తగ్గించి ఉచిత ఇసుక విధానం అని చెప్పడం హాస్యస్పడం.
వైసీపీ ప్రభ్యుత్వంలో టన్నుకు 1450 మాత్రమే… pic.twitter.com/Xb06BjPnH6
— Jagananna Connects (@JaganannaCNCTS) July 9, 2024
దీనికి అధికార వర్గాలు స్పందిస్తూ.. వేరే ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఇసుక ఈ రేటు ఉందని పేర్కొంటున్నాయి. ఇసుక కావాల్సిన వారు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుల లోడింగ్, రవాణా ఛార్జీలను చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు కూడా కలిసి ఈ రేటును ఫిక్స్ చేసినట్లు తెలిస్తోంది.