Gas Cylinder Explosion: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం, ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి కొడుకు మృతి, గుంటూరులో మంటల్లో బాలుడి ఆహుతి, మరొకరికి తీవ్ర గాయాలు
Representational Image (Photo Credits: Twitter)

Amaravati, August 28: ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో (Gas Cylinder Explosion) తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొమ్మిడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి.

దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్‌ పేలడంతో వచ్చిన మంటల్లో నిద్రిస్తున్న బొమ్మిడి నాగరాజు(35), కుమారుడు రోహిత్ కుమార్(6) విగతజీవులుగా (Father and Son Died) కనిపించారు. నాగరాజు భార్య, మరో కుమారుడు బంధువుల వివాహానికి ఊరు వెళ్లడంతో నాగరాజు రోహిత్‌తో కలిసి ఇంట్లో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక గుంటూరు జిల్లాలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఇంటికి నిప్పంటుకోవడంతో గదిలో నిద్రిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరు మంటలకు ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ హృదయవిదారక ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతగుడిపాడు గ్రామానికి చెందిన భువనగిరి ఏసు, దేవీ దంపతులు బతుకు తెరువుకోసం పిల్లలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు.

ఓ పక్క తాగుడు..మరో పక్క అప్పులు, ముగ్గురు చిన్నారులను, భార్యను దారుణంగా గొంతు కోసి చంపేసిన కసాయి, ఆపై విషం తాగి ఆత్మహత్య, యూపీలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అక్కడే నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పాఠశాలలు తెరవడంతో వారి ఇద్దరు కుమారులు భువనగిరి లక్ష్మీప్రసన్న కుమార్, నాగేంద్రబాబు(12) స్వగ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి కుండపోతగా వర్షం కురవటంతో అన్నదమ్ములు తలుపులు వేసుకొని ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు ఎగసిపడ్డాయి.

ప్రేమించడంలేదని ప్రియురాలిని చంపేశాడు, ఆ తర్వాత విషం తాగి చనిపోయాడు, కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో విషాద ఘటన

దీంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. పెద్దపెట్టున కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేందుకు యతి్నంచారు. దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశారు. బలవంతంగా ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నాగేంద్రబాబు కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీప్రసన్నకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 అంబులెన్స్‌ ద్వారా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.