Gudivada Casino Issue: నా అడ్డాలో కేసినో పెట్టానని నిరూపిస్తే..పెట్రోల్ పోసుకుని ఇక్కడే చచ్చిపోతానని మంత్రి కొడాలి నాని సవాల్, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Kodali Nani (Photo-Video Grab)

Gudivada, Jan 21: గుడివాడలో కేసినో వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసీనో నిర్వహించారంటూ ఆరోపణలు (Gudivada Casino Issue) వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం టీడీపీకి చెందిన ఓ టీమ్ (TDP leaders visit) ఈరోజు గుడివాడకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వర్ల రామయ్య, బోండా ఉమ, ఆలపాటి రాజా, మరికొందరు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ( Police forces deployed in Gudivada) మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను గడ్డం గ్యాంగ్ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. మింగడానికి ఏమీ మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా, వైసీపీ రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని లోకేశ్ విమర్శలు చేశారు. దీని వెనకున్న అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా క్యాసినో నడిపినప్పుడు అడ్డురాని కొవిడ్ నిబంధనల పేరు చెప్పి టీడీపీ నేతలను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎంపీల ప్రేమ బాణాల గోల, బాబు ప్రేమ కోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా అంటూ వైసీపీ ఎంపీ ట్వీట్, కౌంటర్ వేసిన రఘురామ

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో ఉన్నంత కాలం కొడాలి నాని బాగున్నాడని... వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రిగా, పేకాట మంత్రిగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. కొడాలి నాని విషయంలో ఆదిలోనే సీఎం జగన్ స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు కేసినో మంత్రిగా కూడా మారారని... రానున్న రోజుల్లో ఆయన అరాచకం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని చెప్పారు. మాజీ ఎంపీ నారాయణరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నప్పటికీ... ఇంతవరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించని కొడాలి నాని... ఈరోజే తన కన్వెన్షన్ సెంటర్ లో ఎస్సీ సెల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని... ఇది అతనిలోని భయాన్ని సూచిస్తోందని అన్నారు.

ఏపీలో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె, పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర, ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

కేసినో నిర్వహించారన్న వ్యాఖ్యలకు సంబంధించి గుడివాడలో తన కె కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) స్పందించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసినో అంటే చంద్రబాబుకు, లోకేష్‌కు బాగా తెలుసని అన్నారు. తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.