Guntur Man arrested for selling medicine under the name of Anandaiah Corona medicine (Photo-Twitter/Guntur Police)

Guntur, June 14: గత కొద్ది కాలంగా ఆనందయ్య కరోనా మందు పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ మందు కరోనాని నయం చేస్తుందని, కరోనా రాకుండా కాపాడుతుందనే వార్తల నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య కరోనా మందుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే దీన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఆనందయ్య కరోనా మందు అంటూ నకిలీ మందును విక్రయిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆనందయ్య మందు అంటూ ప్రజలను మభ్యపెడుతూ లక్షల రూపాయలు దండుకున్న వ్యక్తిని (Guntur Man arrested for selling medicine) గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు భరోసానిస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కోవిడ్‌తో మరణించిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సుకి రూ.20 లక్షలు,ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఆనందయ్య కరోనా మందు పేరుతో (Anandaiah Corona medicine) అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ ఎస్‌ఐ బి.వెంకటాద్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం గ్రామంలో సోదాలు నిర్వహించారు.

గ్రామానికి చెందిన అన్నే కాంతారావు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని సోదా చేయగా అతని వద్ద ఉన్న సంచిలో కరోనా మందు పేరిట అమ్ముతున్న 150 ప్యాకెట్లు కనిపించాయి. విచారణలో గత 10 రోజులుగా గ్రామస్తులకు 750 ప్యాకెట్లను.. ఒక్కో ప్యాకెట్‌ రూ.200కు అమ్మినట్టు చెప్పాడు. అమ్మిన ప్యాకెట్ల తాలూకు రూ.1.50 లక్షలతో పాటు మిగతా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.