Andhra Pradesh Rains: Heavy Rains in These Districts Over Low Pressure

Vijayawada, Nov 22: ఏపీలోని (AP) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains in AP) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, శనివారం నాటికి ఇది ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనంగా అటు నుంచి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

తుఫానుగా మారే అవకాశం కూడా..

ప్రస్తుత అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)