Amaravati, August 4: ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశమున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం (Heavy RainFall Warning) ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని , మత్సకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లోకి ఫలితాల సమాచారం
ఈ రెండు రోజులు అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు.
ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతివాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.