Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కి వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కి వాయిదా
Chandrababu Naidu (Photo-Video Grab)

Vjy, Sep 21: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, లైవ్ అప్ డేట్స్ ఇవిగో..

టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

(The above story first appeared on LatestLY on Sep 21, 2023 12:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).