Andhra Pradesh: జగన్ విజయం.. విజయవాడ ప్రభుత్వ స్కూలులో తమ పిల్లలను చేర్పించిన ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపిన శాప్‌ ఎండీ సతీమణి
SAAP MD Prabhakar Reddy (Photo-Facebook)

Vjy, July 5: ఏపీలో నాడు నేడు పోగ్రాంతో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ వచ్చిందనే చెప్పవచ్చు. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి (IAS officer prabhakar reddy) తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో( government school in patamata) చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేశామని ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అన్నారు. జగనన్న విద్యాకానుక కిట్స్ వచ్చేశాయి, రూ.931.02 కోట్లతో 47,40,421 మంది విద్యార్థులకు ఈ ఏడాది కిట్లును ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. స్కూల్‌లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ అన్నీ చాలా బాగున్నాయన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. కాగా వేసవి సేలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు మంగళవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. విజయవాడలో పడమట పాఠశాలలో గతేడాది నాలుగు వందల మందికి పైగా కొత్తగా విద్యార్థులు చేరగా.. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్తగా చేరనున్నట్లు అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.