AP CM YS Jagan

Amatavati, August 15: స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP Chief Minister YS Jagan) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా (unveiled the national flag) ఆవిష్కరించారు.

అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శనను వీక్షించి ప్రసంగించారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేసెజ్ ద్వారా చెప్పేయండి

అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు సీఎం జగన్‌. రైతన్నలకు సెల్యూట్‌. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్‌ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్‌ లిస్ట్‌లో కొనసాగుతోందని గుర్తుచేశారు సీఎం జగన్‌. ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సీఎం జగన్‌ మాట్లాడారు.